యాదాద్రిలో పర్యటిస్తున్న కేసీఆర్

- February 07, 2022 , by Maagulf
యాదాద్రిలో పర్యటిస్తున్న కేసీఆర్

యాదాద్రి: సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్లారు.యాదాద్రిలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ్మస్వామిని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు.అనంతరం వేద పండితులు సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనం అందించారు.బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ మరోసారి పరిశీలించారు.సీఎం కేసీఆర్ కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలన జరిపారు.

ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు.మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామి వారి దర్శనానికంటే ముందే కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ స్వరూంను పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com