అల్ ఖాల్: వ్యాక్సినేషన్ పొందని విద్యార్థులకు మాత్రమే యాంటిజెన్ టెస్టులు
- February 07, 2022
ఖతార్: నేషనల్ హెల్త్ స్ట్రాటజిక్ గ్రూప్ (కోవిడ్ 19) ఛెయిర్ మరియు హమాద్ మెడికల్ కార్పొరేషన్ ఇన్ఫెక్షయస్ డిసీజెస్ హెడ్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ ఖాల్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ పొందని విద్యార్థులకు మాత్రమే యాంటిజెన్ టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పాండమిక్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. జనవరి 30 నుంచి రెండు వారాల పాటు యాంటిజెన్ టెస్ట్ తప్పనిసరి చేయడం జరిగిందనీ, జనవరి మూడోవారం నుంచి వ్యాక్సిన్ పొందని విద్యార్థులకే ఈ టెస్టులు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 5 నుంచి 11 ఏళ్ళ తమ చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయించే విషయమై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







