యూఏఈ లో కేరళ సంప్రదాయ నెహ్రూ బోట్ రేస్!

- February 07, 2022 , by Maagulf
యూఏఈ లో కేరళ సంప్రదాయ నెహ్రూ బోట్ రేస్!

యూఏఈ: కేరళలో సంప్రదాయ బద్ధంగా జరిగే బోటు రేస్, యూఏఈలో తొలిసారిగా జరగనుంది. రస్ అల్ ఖైమాలో మార్చి 27న ఈ రేస్ నిర్వహిస్తారు. దివంగత భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరు మీదుగా ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ మెరైన్ స్పోర్ట్స్ క్లబ్, ది బ్రూ మీడియా ఎఫ్‌జెడ్‌సి ఎల్ఎల్‌సి సంయుక్తంగా ఈ రేసుని నిర్వహిస్తున్నారు రస్ అల్ ఖైమాలో. యూఏఈ నెహ్రూ ట్రోఫీ 2022 బ్రోచర్‌ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల యూఏఈలో పర్యటించిన సందర్భంలో విడుదల చేశారు. కేరళ సంప్రదాయం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు ఆనందంగా వుందని ఆయన అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com