ఎక్స్ పో 2020 దుబాయ్: ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ డ్రాలో విజేతలు వీరే
- February 08, 2022
దుబాయ్: ఎక్స్ పో 2020 దుబాయ్ ఇండియా పెవిలియన్‌లో ఎయిర్ ఇండియా ‘ఎక్స్ ప్రెస్ లక్కీ డ్రా’లో ఇద్దరు ఇండియన్స్ విజేతలుగా నిలిచారు. భారత కాన్సుల్-జనరల్ డాక్టర్ అమన్ పూరితో పాటు టాటా సన్స్ & కంపెనీల అధికారులు, GMEA ప్రాంతానికి చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారుల సమక్షంలో తీసిన డ్రా లో సలోని సచిన్ షా, సన్హా షెజ్రిన్లు విజేతలుగా నిలిచారు. దాంతో వీరు ఇండియాలో ఏదైనా ప్రాంతానికి ఆగస్టు 31 లోపు అమల్లో ఉండే ఉచిత రౌండ్-ట్రిప్ టిక్కెట్లను పొందారు. ఇటీవల ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ప్రయాణించిన వారు తమ బోర్డింగ్ పాస్‌లను ఇండియా పెవిలియన్ వద్ద ఉన్న ఎయిర్ ఇండియా కియోస్క్ లో చూపడం ద్వారా డ్రాలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







