తెలంగాణలో కరోనా ఆంక్షలు ఎత్తివేత..

- February 08, 2022 , by Maagulf
తెలంగాణలో కరోనా ఆంక్షలు ఎత్తివేత..

హైదరాబాద్: తెలంగాణాలో క్రమంగా కరోనా కేసులు దిగివస్తున్నాయి.ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవు అని ప్రకటించింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు… కోవిడ్ మూడో వేవ్ తెలంగాణలో ముగిసిపోయిందన్నారు.. థర్డ్‌ వేవ్‌ జనవరి 28న పీక్‌ చూశామన్న ఆయన.. ఆ తరవాత తగ్గుతూ వచ్చిందన్నారు.. పాజిటివిటీ రేట్ తగ్గింది… తెలంగాణలో 2 శాతం లోపే పాజిటివిటీ రేటు ఉందన్నారు.. ఇక, తెలంగాణలో థర్డ్‌ వేవ్‌ ముగిసినట్టే అనే స్పష్టం చేశారు.. సీఎం కేసీఆర్‌ సలహాలు, సూచనలతో కోవిడ్ అన్ని వేవ్‌లను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం అన్నారు.. ఫీవర్ సర్వేతో కోవిడ్ కంట్రోల్‌లో సక్సెస్ అయ్యామని.. వాక్సిన్ ఒక ఆయుధంగా పని చేసిందని పేర్కొన్నారు.

ఇక, వారం లోగా రోజువారి పాజిటివ్‌ కేసుల నమోదు వందకు పడి పోయే అవకాశం ఉందన్నారు శ్రీనివాసరావు.. అయితే, అజాగ్రత్తగా ఉండొద్దు… కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.. వాక్సిన్ తీసుకున్న వారు తక్కువ హాస్పిటలైజ్ అయ్యారు… తీసుకోని వారు ఎక్కువగా ఆస్పత్రి పాలయ్యారని తెలిపిన ఆయన.. రాష్ట్రంలో 5.67 లక్షల ఐసోలేషన్ కిట్స్ ఇచ్చాం అన్నారు.. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవని.. అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేసుకోవచ్చు అని స్పష్టం చేశారు.. ఐటీ, ఇతర సంస్థలు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించిన ఆయన.. మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.. మరోవైపు.. నిజామాబాద్, కొమురం భీం జిల్లాలు మొదటి డోస్ వంద శాతం పూర్తి కాలేదన్నారు.. ఇక, ఇప్పట్లో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం కూడా లేదన్న ఆయన.. కోవిడ్ రాబోయే రోజుల్లో సాధారణ ఫ్లూగా మారనుంది… లేదా డెంగ్యూ లా రోగ నిరోధక శక్తిని తగ్గించేలా మారొచ్చు… లేదా కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందొచ్చు అన్నారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com