సౌదీ అరేబియాలో 277K పైగా స్థానికులకు జాబ్స్

- February 09, 2022 , by Maagulf
సౌదీ అరేబియాలో 277K పైగా స్థానికులకు జాబ్స్

సౌదీ: గత ఏడాది ప్రైవేట్ రంగంలో 277,000 మందికి పైగా సౌదీ సిటిజన్స్ కు ఉద్యోగాలు కల్పించడం ద్వారా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ ఫండ్ (హెచ్‌ఆర్‌డిఎఫ్) కొత్త రికార్డు సృష్టించింది. ఈ మేరకు హెచ్‌ఆర్‌డిఎఫ్ ఓ నివేదికలను విడుదల చేసింది. మార్కెట్ అవసరాలు, న్యూ ప్రోగ్రామ్స్ రీడిజైన్, ప్రైవేట్ సెక్టర్ కు అవరమైన వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధికి తీసుకున్న ప్రత్యేక చర్యలతోనే ఇది సాధ్యమైందని హెచ్‌ఆర్‌డిఎఫ్ స్పష్టం చేసింది. ముఖ్యంగా సైనిక పరిశ్రమలలో శిక్షణ స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్, ఆన్-ది-జాబ్ ట్రైనింగ్(తమ్హీర్), ఇ-ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లు మంచి ఫలితాన్ని ఇచ్చాయని హెచ్‌ఆర్‌డిఎఫ్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com