భారత్ కరోనా అప్డేట్
- February 09, 2022
న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి తొలివారంలో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 67, 597 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం 71,365 కేసులు వెలుగుచూశాయి. అంటే నిన్నటితో పోలిస్తే 4వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976కి పెరిగింది.
మరోవైపు మృతుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 1,217 మంది మరణించారు. మంగళవారం మరణాల సంఖ్య 1,188గా నమోదు కాగా ఈరోజు కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,05,279కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 8,92,828గా నమోదైంది. అటు దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







