దుబాయ్ హిందూ దేవాలయంపై కలశాల ఏర్పాటు

- February 09, 2022 , by Maagulf
దుబాయ్ హిందూ దేవాలయంపై కలశాల ఏర్పాటు

దుబాయ్: జెబెల్ అలీలోని హిందూ దేవాలయంపై కలశాల స్థాపన ఫిబ్రవరి 9తో  పూర్తవుతుందని ఆలయ అధికారులు చెప్పారు. ఈ మేరకు వారు కొన్ని ఫోటోలను విడుదల చేశారు.ఆలయాలపై కొన్ని కలశాలను ఏర్పాటు చేయడం వాటిల్లో కన్పించింది. కొత్తగా నిర్మితమవుతున్న హిందూ దేవాలయ నిర్మాణ స్థలంలో శనివారం కలశ పూజలు జరిగిన విషయం తెలిసిందే.తాజాగా వాటిని దేవాలయంపై అమర్చారు. ఈ కలశాలను ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించారు. మొత్తం 9 కలశాల్లో ఎత్తైన కలశం 1.8 మీటర్ల ఎత్తు, 120 కిలోల బరువు ఉంటుంది. మిగిలిన ఎనిమిది ఒక్కొక్కటి 1.2 మీటర్ల ఎత్తు, 90 కిలోల బరువు ఉంటుందని గురుదర్బార్ సింధీ ఆలయ ధర్మకర్తలలో ఒకరైన రాజు ష్రాఫ్ చెప్పారు. ఈ ఆలయాన్ని అధికారిక దసరా 2022కి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. జెబెల్ అలీలోని గురునానక్ దర్బార్ పక్కనే కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతానికి వివిధ మతాల కారిడార్‌గా గుర్తింపు వస్తదని స్థానికులు భావిస్తున్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన హిందూ మత విశ్వాసాలకు అనుగుణంగా కొత్తగా నిర్మించే ఆలయంలో 11 మంది హిందూ దేవతలను ప్రతిష్టించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com