దుబాయ్ లో ట్రాక్‌లెస్ ట్రామ్ సిస్టమ్.. అధ్యయనానికి ఒప్పందం
- February 10, 2022
దుబాయ్: దుబాయ్ ట్రామ్ కోసం టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి చైనాకు చెందిన సీఆర్ఆర్సీ(CRRC) ఝుజౌతో ఒప్పందంపై దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రైల్ ఏజెన్సీ, RTA CEO అబ్దుల్ మొహసేన్ ఇబ్రహీం యూన్స్, CRRC ఝుజౌ CEO యాంగ్ జిగువో ఒప్పందంపై సంతకాలు చేశారు. దుబాయ్‌లో ట్రాక్‌లెస్ ట్రామ్ సిస్టమ్‌ను రూపొందించే సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి చైనీస్ CRRC ఝుజౌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ఇబ్రహీం యూన్స్ తెలిపారు. ట్రాక్‌లెస్ ట్రామ్ సిస్టమ్ అనేది ఆధునిక సౌకర్యవంతమైన వ్యవస్థ అని, ఇది ప్రజా రవాణా ఖర్చు, ఇంధనం ఆదా చేస్తుందన్నారు. ఈ సందర్భంగా జిగువో మాట్లాడుతూ.. వినూత్నమైన, స్మార్ట్, గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ సొల్యూషన్స్ దుబాయ్‌కి అందించడానికి ఎదురుచూస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..