శ్రీవారి దర్శనం టికెట్లను పెంచుతున్న టీటీడీ
- February 10, 2022
తిరుమల:తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్టు చెప్పారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లను జారీ చేస్తామని తెలిపారు.ఈ నెల 16న ఉదయాస్తమ సేవా టికెట్లను విడుదల చేస్తామని చెప్పారు. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన వారికి ఈ టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా విరాళమిచ్చిన భక్తులకు ఉదయాస్తమయ సేవా టికెట్లను జారీ చేస్తామని… ఈ టికెట్ల బుకింగ్ కు ప్రత్యేక పోర్టల్ జారీ చేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!