బహ్రెయిన్ లో 64 ఏళ్ల భారతీయ ఖైదీ విడుదల

- February 11, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో 64 ఏళ్ల భారతీయ ఖైదీ విడుదల

బహ్రెయిన్: తీవ్రమైన డయబెటిక్, అనేక ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 64 ఏళ్ల ప్రవాస భారతీయ ఖైదీ మానవతా కారణాలతో జైలు నుంచి విడుదల అయ్యారు. ఆ తర్వాత ఇండియాకు బయలుదేరాడు. షాహుల్ హమీద్ 2003లో డ్రగ్స్ ను రవాణా చేస్తున్నాడనే కారణంతో అరెస్టయ్యాడు. చట్టవిరుద్ధంగా డ్రగ్స్ కలిగి ఉన్నాడని నిర్ధారణ కావడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. గత 19 ఏళ్లుగా అతను శిక్ష అనుభవిస్తున్నాడు. జూన్ 9, 2003న, అప్పటి సౌదీ అరేబియా రెసిడెంట్ అయిన షాహుల్ తన సెలవులను ముగించుకుని చెన్నై నుండి తిరిగి వస్తున్నాడు. సౌదీలోని అతని సన్నిహితులలో ఒకరు చెన్నై నుండి ఓ పార్సిల్ తీసుకువెళ్లాలని కోరగా.. దాన్ని తనవెంట తీసుకొచ్చాడు. అతడు బహ్రెయిన్ మీదుగా సౌదీ అరేబియా వెళుతుండగా.. బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ లో అతని పార్సిల్ లో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com