ఒమన్ లో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్

- February 11, 2022 , by Maagulf
ఒమన్ లో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్

ఒమన్: కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్ ను ఒమన్ సుల్తానేట్ ప్రకటించింది. దేశం నుండి వచ్చే, బయలుదేరే వ్యక్తుల కోసం ట్రావెల్ మార్గదర్శకాలను అప్డేట్ చేసింది. అవి ఇలా ఉన్నాయి.

ఒమన్ చేరుకోవడం: అన్ని ఓడరేవుల నుండి ఒమన్ సుల్తానేట్‌లోకి ప్రవేశించడానికి 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రయాణీకులందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్, పీసీఆర్ టెస్ట్ రిపోర్టులను అధికారిక Oman MoH వెబ్‌సైట్ http://travel.moh.gov.om ద్వారా QR కోడ్‌తో అప్‌లోడ్ చేయాలి. వచ్చిన తర్వాత కోవిడ్-19 PCR పరీక్ష కోసం రిజర్వేషన్ చేసుకోవాలి. చేరుకున్న తర్వాత ట్రావెల్ రిజిస్ట్రేషన్ ఫారమ్ (TRF) నుండి ప్రయాణ అభ్యర్థనను సమర్పించాలి.

మీరు వ్యాక్సిన్ తీసుకోని వారు (ఒమానీ జాతీయులు మాత్రమే): TRF కోడ్ పొందడానికి అధికారిక Oman MoH వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. అధికారిక ఒమన్ MoH వెబ్‌సైట్ ద్వారా QR కోడ్‌తో ముందస్తు నెగిటివ్ PCR పరీక్ష ఫలితాన్ని అప్‌లోడ్ చేయాలి. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత PCR పరీక్ష చేయించుకోవాలి. 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి. 8వ రోజున మరో PCR పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్ అని తేలితే, అదనంగా మరో 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి.

PCR పాజిటివ్ ఉన్నట్లయితే (ఒమానీ జాతీయులు మాత్రమే): మీరు క్వారంటైన్ ను పూర్తి చేయాలి (ఆయా దేశాల నిబంధనల ప్రకారం..). క్వారంటైన్ పీరియడ్‌ని పూర్తి చేసిన తర్వాత కోలుకున్నారని పేర్కొంటూ హెల్త్ కేర్ ప్రొవైడర్ నుండి తప్పనిసరిగా “ఇమ్యూనిటీ సర్టిఫికేట్” పొందాలి. ఒమన్‌కు చేరుకున్నప్పుడు దాన్ని చూపించాలి. వీరికి PCR పరీక్ష లేదా క్వారంటైన్ అవసరం లేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com