కువైట్ లో 5 రోజులకు తగ్గనున్న క్వారంటైన్ పీరియడ్..!
- February 11, 2022_1644554161.jpg)
కువైట్: క్వారంటైన్ వ్యవధిని ప్రస్తుత 7 రోజులకు బదులుగా 5 రోజులకు తగ్గించే కొత్త ప్రతిపాదనను కరోనా మినిస్టీరియల్ కమిటీ తన తదుపరి సమావేశంలో చర్చించనుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి క్వారంటైన్ పీరియడ్ ను వారానికి బదులుగా 5 రోజులకు, కాంటాక్టులకు ఒక వారానికి తగ్గించాలని ఆలోచన చేస్తోంది. అయితే, క్వారంటైన్ ను ఎన్ని రోజులకు పరిమితం చేయాలనేదానిపై కమిటీ చర్చిస్తుందని ఉన్నత వర్గాలు తెలిపాయి. కాంటాక్ట్ ను మూడవ రోజు పరీక్షించడానికి, ఐదవ రోజున మరొక పరీక్షను చేసి తద్వారా అతని క్వారంటైన్ ని ముగించే అవకాశం ఉందని సమాచారం. కమిటీ బూస్టర్ డోస్‌కు సంబంధించిన ప్రతిపాదనను కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్ అనేది తప్పనిసరి చేయొద్దనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉన్నందునా పరిమితులను ఉపసంహరించుకోవడంతోపాటు మరికొన్ని అంశాలపై కమిటీ చర్చించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్