వాయిస్ కాల్స్ చేసుకొనే అవకాశం
- March 29, 2016
ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ కోసం వాట్సప్, స్కైప్, వైబర్ లాంటి యాప్స్ వినియోగదారులకు శుభవార్త. ఈ యాప్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్కు సంబంధించిన ల్యాండ్‌లైన్ ఫోన్లకు కాల్స్ చేసుకొనేందుకు ప్రభుత్వం వెసులుబాటును కలిగించింది. ఇంటర్నెట్ ప్రొటోకాల్ సేవలతో వాయిస్ కాల్స్‌ను అనుసంధానం చేయాలని టెలికం పర్యవేక్షణ సంస్థ ట్రాయ్ చేసిన సిఫారసును కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ మంత్రుల కమిటీకి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికం ఆపరేటర్లకు మధ్య సోమవారం ఒప్పందం కుదిరింది.ఈ సేవలు త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇంటర్నెట్ సదుపాయం ద్వారా తక్కువ ధరకే (మొబైల్ డాటా వినియోగం ఆధారంగా) వాయిస్ కాల్స్ చేసుకొనే అవకాశం వినియోగదారులకు కలుగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









