‘వీసా’ బదిలీ గడువు పొడిగింపు

- February 12, 2022 , by Maagulf
‘వీసా’ బదిలీ గడువు పొడిగింపు

కువైట్: వీసాలు నవంబర్ 24, 2021కి ముందు జారీ చేసిన కమర్షియల్ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్‌ వీసాలుగా మార్చుకునేందుకు గడువును పొడిగించేందుకు అడ్మినిస్ట్రేటివ్ సర్క్యులర్‌ను జారీ చేసినట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్-మౌసా ప్రకటించారు. కరోనా ఎమర్జెన్సీ, మంత్రివర్గ కమిటీ ఆదేశాల మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 11/24/2021కి ముందు జారీ చేయబడిన కమర్షియల్ విజిట్ వీసాలను ఆర్టికల్ నంబర్ 18 ప్రకారం వర్క్ వీసాలుగా బదిలీ చేయడానికి ప్రస్తుత సర్క్యులర్ అనుమతిస్తుంది. కమర్షియల్ విజిట్ ఎంట్రీ వీసా ఉన్న దరఖాస్తుదారులకు వర్క్ పర్మిట్‌లను 3/31/2022 వరకు పొడిగించినట్టు.. ఈ మేరకు అన్ని విభాగాలు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు అల్-మౌసా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com