ఏపీలో నైట్ కర్ఫ్యూ తొలగింపు..
- February 14, 2022
అమరావతి: ఏపీ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. వేల సంఖ్యలో.. పాజిటివ్ కేసులు నమోదవుతున్న క్రమంలో.. ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలు, ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాత్రి వేళ కర్ఫ్యూ విధించింది సీఎం జగన్ ప్రభుత్వం. అయితే.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళ ఉన్న కర్ఫ్యూ ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. మాస్క్ కంపల్సరీ ధరించే నిబంధన, మార్గదర్శకాలు కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సమావేశం నిర్ణయించింది. ఫీవర్ సర్వే కొనసాగించాలన్న సీఎం జగన్ ఆదేశించారు. లక్షణాలు ఉన్న వారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తి చేయాలని, సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు సీఎం జగన్. ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను వేర్వేరుగా చేయాలని, పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. స్పెషలిస్టు వైద్యులకు ఇస్తన్న మూలవేతనంలో 50శాతం, వైద్యులకు 30 మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు తయారు చేశామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!







