ఏపీ కరోనా అప్డేట్
- February 14, 2022
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. తాజాగా మరొకరు కరోనాతో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఒక కరోనా మరణం సంభవించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 4వేల 636 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 15వేల 193 కరోనా టెస్టులు చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 3,28,46,978 కోవిడ్ నిర్ధరణ పరీక్షలు చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,13,212. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,83,788. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14వేల 698. రాష్ట్రంలో ప్రస్తుతం 14వేల 726 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారంతో(749 కేసులు, 3 మరణాలు) పోలిస్తే సోమవారం కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గడం ఊరటనిచ్చే అంశం.
మొన్నటి వరకు ఒమిక్రాన్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దీంతో కొత్త కేసులు భారీగా తగ్గాయి. దీంతో దేశ ప్రజలు కాస్త రిలీఫ్ అవుతున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!







