కువైట్ లో ఫిబ్రవరి 20 నుంచి PCR టెస్ట్ నిబంధన ఎత్తివేత

- February 15, 2022 , by Maagulf
కువైట్ లో ఫిబ్రవరి 20 నుంచి PCR టెస్ట్ నిబంధన ఎత్తివేత

కువైట్: కువైట్ వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి 20 నుండి PCR టెస్ట్ రిపోర్ట్, క్వారంటైన్ నిబంధనలను ఎత్తివేయనున్నారు. పూర్తి వ్యాక్సిన్ డోసులు(రెండు) తీసుకున్న సిటిజన్స్, రెసిడెంట్స్, టూరిస్టులు ఇకపై దేశంలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత PCR పరీక్షను చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే హోమ్ క్వారంటైన్(7 రోజులు) ఉండాల్సిన పని లేదని ప్రభుత్వ ప్రతినిధి M. తారిక్ అల్-ముజారమ్ వెల్లడించారు. ఫిబ్రవరి 20 (ఆదివారం) ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు.  అయితే వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులు ప్రయాణానికి ముందు 72 గంటల ముందు తప్పనిసరిగా PCR పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తారిక్ అల్-ముజారమ్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com