జెడ్డాలో కూల్చివేసిన ఆస్తులకు పరిహారం

- February 16, 2022 , by Maagulf
జెడ్డాలో కూల్చివేసిన ఆస్తులకు పరిహారం

సౌదీ: జెడ్డాలో పునర్నిర్మాణం కోసం కూల్చివేసిన ఆస్తులకు సంబంధించి పరిహారం చెల్లింపు 60 రోజుల తర్వాత ప్రారంభమవుతుందని స్టేట్ ప్రాపర్టీస్ జనరల్ అథారిటీ (SPGA) గవర్నర్ ఇహ్సాన్ బఫకిహ్ తెలిపారు. కూల్చివేసిన వాటిల్లో 10-15 శాతం మాత్రమే చట్టపరమైన యాజమాన్య పత్రాలను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. కూల్చివేసిన ఆస్తుల విలువను అంచనా వేయడానికి కమిటీలను ఏర్పాటు చేశామని, ఆరు నెలల్లో పరిహారం చెల్లించబడుతుందని చెప్పారు. ఇప్పటివరకు కూల్చివేసిన వాటిల్లో సరైన టైటిల్ డీడ్‌ లు ఉన్నవి 10 శాతం నుంచి 15 శాతం వరకు మాత్రమే ఉంటాయని, మిగిలినవి అత్యధికంగా అక్రమంగా నిర్మాణించినవని చెప్పారు. మురికివాడలు, నిర్దేశిత ఏరియాల్లో నివసించే వారి కోసం SPGA జారీ చేసిన ప్రమాణాలు సౌదీ అంతటా వర్తిస్తాయని బఫాకిహ్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com