డెలివరీ సర్వీస్ ఫీని నిర్ణయించిన ఖతార్
- February 16, 2022
ఖతార్: ఆన్‌లైన్ కంపెనీలు సర్వీస్ ఛార్జీలకు సంబంధించి అధికారులు విధించిన నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఖతార్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆన్‌లైన్ షాపులకు డెలివరీ సర్వీస్ ఫీజు బైక్‌పై 10 QAR లేదా వాహనం ద్వారా అయితే 20 QAR మించకూడదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల సర్వీస్ ధరలు కేవలం మార్కెటింగ్ విషయంలో మొత్తం ఆర్డర్ ధరలో 10%, మార్కెటింగ్ అండ్ డెలివరీ విషయంలో 20% ఉండాలి అని మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక మార్కెట్‌లోని వస్తువులు, సేవల ధరలను నియంత్రించడానికి తాజా చర్యలు తీసుకోబడ్డాయని పేర్కొంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వినియోగదారుల రక్షణపై చట్టం నంబర్ 8 2008 ప్రకారం ఒక మిలియన్ ఖతార్ రియాల్ జరిమానాతోపాటు మూడు నెలల పాటు సంబంధిత వ్యాపారం మూసివేతను విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. అధిక ధరలను వసూలు చేసే వాటిపై వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







