ఏపీ కరోనా అప్డేట్
- February 16, 2022
అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా వేల సంఖ్యలో వెలుగు చూసిన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. వేల సంఖ్యలో నమోదైన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యలో రికార్డవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తోంది. రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఇక కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 675 మందికి కరోనా సోకింది. చిత్తూరు, కృష్ణా, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,14,502 పాజిటివ్ కేసులకు గాను…22,88,989 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.14,705 మంది చనిపోయారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 10,808గా ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!