ఏపీ కరోనా అప్డేట్
- February 19, 2022
అమరావతి: ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19వేల 769 కరోనా పరీక్షలు చేశారు.
గడిచిన 24 గంటల్లో 1,486 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,29,58,399 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 710కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7వేల 358 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,950. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,93,882. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కాగా, క్రితం రోజుతో(495 కేసులు) పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







