కరోనా అంతంపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ కీలక వ్యాఖ్యలు!
- February 19, 2022
జెనీవా: కరోనా మహమ్మారి వ్యాప్తికి, ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు పరిస్ధితులు అనుకూలంగా ఉన్నా మనం మహమ్మారి అంతానికి సంసిద్ధమైనరోజు అది అంతమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసస్ అన్నారు. జర్మనీలో జరుగుతున్న మునిచ్ సెక్యూరిటీ సదస్సు 2022 లైవ్ సెషన్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి నుంచి బయటపడటంపైనే ప్రపంచం దృష్టిసారించాలని ఆయన నొక్కిచెప్పారు.
రెండేండ్ల కిందట మనం కలుసుకున్నప్పుడు వైరస్ గుప్పిట్లోకి జారుతున్నామని, అయితే మహమ్మారి మూడో ఏడాదిలోకి మనం ఇలా అడుగుపెడతామని అప్పట్లో ఏ ఒక్కరూ ఊహించలేదని అన్నారు. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మనమందరం సమాయాత్తమైతే మహమ్మారి ఎంతగా వ్యాప్తి చెందుతూ ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చినా దాన్ని మనం కట్టడి చేసి అంతం చేయవచ్చని అన్నారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లు అధికంగా ఇవ్వడంతో పాటు ఒమిక్రాన్ తీవ్రత తక్కువగ ఉండటంతో మహమ్మారి ముగిసిందనే ప్రచారం సాగిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!