విదేశాల్లో తొలి ఐఐటీ..యూఏఈలో ఏర్పాటు చేయనున్న ఇండియా
- February 20, 2022
యూఏఈ: ఇండియా-యూఏఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం పై ఫిబ్రవరి 18న సంతకాలు చేశారు. ఇండియా వెలుపల IIT స్థాపించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం, భారతదేశంలో 23 IITలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలు BTech నుండి డాక్టోరల్ ప్రోగ్రామ్‌ల వరకు విభిన్నమైన డిగ్రీలను అందించే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లు. వీటిల్లో ప్రవేశాలు దొరకడం చాలా కష్టం. ఇండియా అండ్ UAE దేశాల మధ్య వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో US $ 100 బిలియన్లకు పెంచే లక్ష్యంతో చారిత్రక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై ఇటీవల సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సమావేశంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..