భారత్ కరోనా అప్డేట్
- February 20, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా తగ్గుముఖం పట్టింది.మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,968 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.శనివారం 48,847 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మన దేశంలో నిన్న 673 మరణాలు నమోదయ్యాయి.
కరోనా టెస్ట్ పాజిటివిటీ రేటు కూడా పడిపోతోంది. నిన్న టెస్ట్ పాజిటివిటీ రేటు 1.68కి తగ్గింది. పాజిటివ్ రేటు తగ్గడంతో కొత్త కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గుతోంది.తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,22,473కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 4,20,86,383 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 5,11,903 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 2,24,187 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.ప్రస్తుతం కేరళలోనే కాస్త ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.శనివారం 6,757 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్న 524 మరణాలు నమోదయ్యాయి. ఇందులో బ్యాక్‌లాక్ మరణాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో 75,813 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
మహారాష్ట్రలో 1635, కర్నాటకలో 1135, తమిళనాడులో 1051, మిజోరాంలో 1326 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో 425, తెలంగాణలో 401 కరోనా కేసులు వచ్చాయి.
భారత్‌లో నిన్న 11.87 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం కరోనా పరీక్ష సంఖ్య 75.93 కోట్లకు చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 30.81 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు.ఇప్పటివరకు 175.37 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..