సోనియా గాంధీ నేతృత్వంలో విపక్ష కూటమికి ప్రయత్నాలు
- February 20, 2022
న్యూ ఢిల్లీ: టార్గెట్.. 2024 ఎన్నికలు..లక్ష్యం.. ఢిల్లీ పీఠం..ఇదే లక్ష్యంతో అప్పుడే పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కూటమిల ఏర్పాటుకు చురుగ్గా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో భారీ విపక్ష కూటమికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు విపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించిన సోనియా.. ఈసారి బలమైన కూటిమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. మరోసారి విపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే కూటమి ఉంటే మంచిదని సీపీఎం లాంటి పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో నిర్వహించిన విపక్ష పార్టీల సమావేశాల్లో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ప్రయోజనాలను పక్కనపెట్టి రాజ్యాంగాన్ని, ప్రజస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసి ముందుకు సాగుదామని కోరారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఐక్యంగా ముందడుగు వేద్దామని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వానికి పార్టీలు అభ్యంతరం చెప్పకుండా సోనియా.. ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ దారి కాంగ్రెస్‌దే.. తమ దారి తమదే అంటోంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా.. మమత, కేసీఆర్.. విపక్ష కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్ష పార్టీలను ఏకం చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నారు.
తృణమూల్‌తో ఏకీభవిస్తూ కాంగ్రెస్ రహిత కూటమికి కొన్ని పార్టీలు మద్దతు తెలుపుతుంటే.. కాంగ్రెస్ నేతృత్వంలోనే కూటమి ఉండాలని మరికొన్ని పార్టీలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీపీఎం పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది కూడా. రాష్ట్రాలపై కేంద్రం దాడిని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు ఐక్యం కావడాన్ని స్వాగతిస్తూనే.. రాజకీయ కూటమిని సీపీఎం వ్యతిరేకించింది. కాంగ్రెస్‌ను కలుపుకుని ముందుకు వెళితేనే కూటమి విజయం సాధిస్తుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే సీపీఎం నేత సీతారాం ఏచూరీ.. రాహుల్ గాంధీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. కూటమికి కాంగ్రెస్ నేతృత్వానికి బలంగా మద్దతిస్తున్నారు.
తృణమూల్, టీఆర్ఎస్ కూటమి సంప్రదింపులు, సమాలోచనలతో సంబంధం లేకుండా అన్ని విపక్ష పార్టీలను కలుపుకునిపోవాలని.. కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మమత, కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్న పార్టీలను కూడా కాంగ్రెస్.. విపక్ష సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించుకుంది. బీజేపీ ముక్త భారత్ అజెండాగా ముందుకు రావాలని పిలుపు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నిర్వహించనున్న ఈ విపక్ష సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి