దేశం దశ, దిశను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం: తెలంగాణ సీఎం కేసీఆర్

- February 20, 2022 , by Maagulf
దేశం దశ, దిశను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం:  తెలంగాణ సీఎం కేసీఆర్

హైదరాబాద్: దేశం దశ, దిశను మార్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం దేశంలో పాలన సరైన రీతిలో జరగడం లేదని, కొత్త అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక కూటమికి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ మొదట సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. లంచ్ మీటింగ్ అనంతరం నేరుగా ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ఇంటికి వెళ్లారు. ఆయనతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. గంటన్నర పాటు జరిగిన ఈ భేటీ అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ పోరాటాన్ని శరద్ పవార్ ఎప్పుడూ సమర్థించారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటులో ఎంతో సహాయం చేశారని ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. భావసౌరుప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలోనే మరికొందరు నేతలతో సమావేశమై చర్చించనున్నట్లు, అందరం చర్చించి ఒక అజెండా రూపొందించుకుని ముందుకెళుతామన్నారు. త్వరలోనే అందరి నేతలతో సమావేశం జరుపుతామన్నారు. అందర్నీ కలుపుకుని పని మొదలు పెడుతామని అయితే.. వీరందరితో మాట్లాడానికి కొంత సమయం పట్టవచ్చని, ఒక ఎజెండా, కార్యాచరణను దేశం ఎదుట ప్రకటిస్తామన్నారు సీఎం కేసీఆర్.

రైతుల సంక్షేమం విషయంలో దేశానికే తెలంగాణ మార్గం చూపించిందని ప్రశంసించారు శరద్ పవార్. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణను చర్చించడం కోసం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర బాట పట్టారు. 2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం ఆయన ముంబైకి వెళ్లారు. ఆదివారం బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అనంతరం విమానంలో ముంబైకి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట మహారాష్ట్రకు వెళ్లిన వారిలో ఎంపీలు కేకే, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, ఇతరులున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com