ఆర్మీ హెలికాప్టర్ లో నెల్లూరుకు గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలింపు
- February 22, 2022
హైదరాబాద్: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నేడు హైదరాబాద్ నుండి నెల్లూరుకు కుటుంబ సభ్యులు తరలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టు నుండి గౌతమ్ భౌతికకాయాన్ని నెల్లూరులోని నివాసానికి తరలించనున్నారు. ఈ రోజు రాత్రికి అమెరికా నుండి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రానున్నారు.
హెలికాప్టర్ లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహంతో తల్లి, భార్య వెళ్లనున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి నెల్లూరుకు బయలు దేరారు. రేపు ఉదయగిరిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించనున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొదటగా స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు. కానీ ఉదయగిరిలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!