యుక్రెయిన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం..సర్వత్రా ఉత్కంఠ
- February 22, 2022
యుక్రెయిన్ - రష్యా ఉద్రిక్తల అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. యుక్రెయిన్, అమెరికా సహా మరో ఆరు దేశాలు ఈ సమావేశం నిర్వహించాలంటూ చేసిన విజ్ఞప్తిపై సభ్య దేశాలు మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశం అయ్యాయి.
ప్రస్తుతం 'యూఎన్ రొటేటింగ్ కౌన్సిల్ ప్రెసిడెన్సీ'గా వ్యవహరిస్తున్న రష్యా ఈ సమావేశాన్ని రాత్రి 9 గంటలకు(న్యూయార్క్ కాలమానం ప్రకారం) షెడ్యూల్ చేసింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కార్యాలయంలో ఈ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా మరియు ఫ్రాన్స్ లతో పాటుగా రష్యాకు కూడా శాశ్వత సభ్యత్వం ఉంది. దీంతో భద్రతా మండలిలో ప్రవేశ పెట్టె బిల్లులకు అంగీకారం - తిరస్కారం తెలిపే హక్కుగా చెప్పబడే 'వీటో పవర్' ఆయా సభ్యదేశాలకు ఉంటుంది. ఈక్రమంలో నేడు నిర్వహించిన అత్యవసర సమావేశంలో రష్యా ఎటువంటి ప్రకటన చేస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ మరియు డొనెట్స్క్ అనే రెండు ప్రావిన్సులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు సోమవారం రష్యా ప్రకటించింది.
"The next hours & days will be critical. The risk of major conflict is real & needs to be prevented at all costs."
— United Nations (@UN) February 22, 2022
-- UN political chief @DicarloRosemary briefing the Security Council on Ukraine. https://t.co/90J8uSLo2G
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!