కిలీ పాల్‌కు భారత హైకమిషన్ సత్కారం
- February 22, 2022
టాంజానియా: ఇంటర్నెట్ సెన్సేషన్ కిలీ పాల్‌ను టాంజానియా లోని భారత హైకమిషన్ సత్కరించింది. హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన కిలీ పాల్‌తో భారత దౌత్యవేత్త బినయ ప్రధాన్ కొన్ని చిత్రాలను పంచుకున్నారు. కిలీ పాల్ టిక్ టాక్ వీడియోల నుంచి వైరల్ అయ్యారు. ఆ తర్వాత ఇన్‌స్టా, తదితర సోషల్ మీడియా సైట్లల్లో ఆయన ఫాలోవర్లు రెండు మిలియన్లకు పైగా ఉన్నారు. కిలీ పాల్, అతని సోదరి నీమా పాల్ తరచుగా ప్రముఖ బాలీవుడ్ , టాలీవుడ్ పాటలకు లిప్ సింక్ చేయడంతోపాటు.. డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇటీవల ‘పుష్ప’ సినిమాలోని ‘సామి సామి’ పాటకు కూడా స్టెప్పులేసి కిలీ పాల్ తన ఫాలోవర్లను ఫిదా చేశాడు . కిలీ పాల్‌ను సత్కరించిన ఫొటోలను భారత హైకమిషన్ ట్విట్టర్లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!