కిలీ పాల్‌కు భారత హైకమిషన్ సత్కారం

- February 22, 2022 , by Maagulf
కిలీ పాల్‌కు భారత హైకమిషన్ సత్కారం

టాంజానియా: ఇంటర్నెట్ సెన్సేషన్ కిలీ పాల్‌ను టాంజానియా లోని భారత హైకమిషన్ సత్కరించింది. హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన కిలీ పాల్‌తో భారత దౌత్యవేత్త బినయ ప్రధాన్ కొన్ని చిత్రాలను పంచుకున్నారు. కిలీ పాల్ టిక్ టాక్ వీడియోల నుంచి వైరల్ అయ్యారు. ఆ తర్వాత ఇన్‌స్టా, తదితర సోషల్ మీడియా సైట్లల్లో ఆయన ఫాలోవర్లు రెండు మిలియన్లకు పైగా ఉన్నారు. కిలీ పాల్, అతని సోదరి నీమా పాల్ తరచుగా ప్రముఖ బాలీవుడ్ , టాలీవుడ్ పాటలకు లిప్ సింక్ చేయడంతోపాటు.. డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇటీవల ‘పుష్ప’ సినిమాలోని ‘సామి సామి’ పాటకు కూడా స్టెప్పులేసి కిలీ పాల్‌ తన ఫాలోవర్లను ఫిదా చేశాడు . కిలీ పాల్‌ను సత్కరించిన ఫొటోలను భారత హైకమిషన్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com