60 ఏళ్ళు పైబడిన వలసదారులకు పొడిగింపు లేదు

- February 23, 2022 , by Maagulf
60 ఏళ్ళు పైబడిన వలసదారులకు పొడిగింపు లేదు

కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, 60 ఏళ్ళు పైబడి, హై స్కూల్ సర్టిఫికెట్లు మాత్రమే వున్న వలసదారులకు వర్క్ పర్మిట్ కొనసాగింపు వుండదని స్పష్టం చేసింది. కొత్త సవరణ ప్రకారమే ఈ కేటగిరీకి చెందినవారు తమ రెసిడెన్సీని రెన్యువల్ చేయించుకోవాలి. వార్షిక రుసుము 250 దిర్హాములు అలాగే ఇన్స్యూరెన్స్ సౌకర్యం పొంది, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. గతంలో వలసదారులకు 30 నుంచి 90 రోజుల మధ్య రెన్యువల్ కోసం పొడిగింపులు ఇచ్చేవారు. ఈ కేటగిరీలో సుమారు 62,948 మంది ప్రైవేటు సెక్టార్‌లో పనిచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com