ఇండియా, పాకిస్థాన్ పెవిలియన్లను సందర్శించిన షేక్ మహ్మద్
- February 25, 2022
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్ , ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎక్స్ పో 2020 దుబాయ్ లోని ఇండియా, పాకిస్తాన్ పెవిలియన్లను సందర్శించారు. ఆయనతో పాటు షేక్ మక్తూమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఉన్నారు. దుబాయ్ ఉప పాలకుడు, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి. షేక్ మొహమ్మద్ మాట్లాడుతూ.. ఎక్స్ పో 2020 దుబాయ్ సృజనాత్మకత, ఆవిష్కరణలకు.. అలాగే కొత్త భాగస్వామ్యాలను ఎంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన వేదికగా పనిచేస్తుందని అన్నారు. గ్లోబల్ ఈవెంట్లో 192 దేశాలు పాల్గొనడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞానం, అనుభవాలు, ఆవిష్కరణల మార్పిడికి అవకాశం లభించిందని, ఇది మంచి భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతుందన్నారు. ఆపర్చునిటీ డిస్ట్రిక్ట్ లోని ఇండియా పెవిలియన్‌ను ఈ బృందం సందర్శించినప్పుడు.. ఇండియా ప్రాచీన నాగరికత, భవిష్యత్తు కోసం ఆకాంక్షలు, వేగవంతమైన వృద్ధి గురించి వివరించారు. ఇండియాలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి కళలు, సంస్కృతి, సాహిత్యం, సినిమా, వంటకాలను అలాగే దేశంలోని వ్యాపార, పెట్టుబడి అవకాశాల గురించి తెలియజేశారు. నాలుగు అంతస్తుల పెవిలియన్ నిర్మాణం కూడా తాజా సాంకేతికతకు నిదర్శనంగా నిలుస్తోందని బృందం అభిప్రాయపడింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, ప్రొజెక్షన్ మ్యాపింగ్ ద్వారా ప్రతిభ, వాణిజ్యం, సంప్రదాయం, పర్యాటకం, సాంకేతికత కండ్లకు కట్టినట్లు ఇండియన్ పెవిలియన్ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్‌కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం