ఏపీ కరోనా అప్డేట్
- February 25, 2022
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు 200 నుంచి 300 వరకు నమోదవుతున్నాయి.దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో ఏపీ ప్రభుత్వం నిబంధనలు, ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే.తాజాగా…24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు.రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18 వేల 915 కరోనా పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 496 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 3,30,66,774 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 722కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,464 చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,98,033. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 4 వేల 709గా ఉంది.
తాజా వార్తలు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!