అంతర్జాతీయ శాంతి విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న అచ్యుతరావు
- February 26, 2022
అమరావతి: జర్మనీకి చెందిన అంతర్జాతీయ శాంతి విశ్వవిద్యాలయం (ఇంటర్నేషనల్ పీస్ యూనివర్శిటీ) నుండి బొప్పన అచ్యుతరావు గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి చెందిన అచ్యుతరావు సమాజా సేవా విభాగంలో అందించిన వినూత్నసేవలకు గాను విశ్వవిద్యాలయం ఈ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. బెంగుళూరు సమీపంలోని హోసూరులో శనివారం జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సంస్ధ కులపతి డాక్టర్ కిమ్ నుండి బొప్పన అచ్యుతరావు డాక్టరేట్ ను అందుకున్నారు.ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ,దుబాయ్ లో రియల్టర్ గా మంచి విజయాలను నమోదు చేసుకున్న బొప్పన తన స్వగ్రామం పెదపాలపర్రుకు విభిన్న రూపాలలో సేవలు అందించారు. తన తండ్రి బొప్పన బాబూరావు పేరిట గ్రామంలో నూతనంగా పంచాయితీ కార్యాలయాన్ని నిర్మించి, ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు నాని ప్రారంభించారు. గ్రామస్ధులకు అండగా ఉంటూ విద్యార్ధుల ఉన్నత విద్య అవసరాలకు ఆర్ధిక సాయం చేయటమే కాక, అత్యవసర సమయాలలో రహదారుల నిర్మాణం, దేవాలయాల జీర్ణోద్ధరణ వంటి అంశాలలో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. గ్రామంలో ఏ అభివృద్ది కార్యాక్రమం చేపట్టాలన్న ఇతోధిక ఆర్ధిక సాయం అందించి తనవంతు సేవాతత్పరతను చాటుకుంటూ ఉండేవారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన శాంతి రాయబారి డాక్టర్ పరిన్ సోమని ముఖ్యఅతిధిగా హాజరుకాగా, శాంతి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎస్ చెల్లాదురై, రిజిస్ట్రార్ డాక్టర్ గోపీ కన్నన్, అన్నామలై యూనివర్శిటీ నుండి అచార్య అంబ్రోస్ తదితరులు పాల్గొన్నారు. బొప్పన అచ్యుతరావుకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయటం పట్ల గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ అభినందనలు తెలిపారు. వ్యధాన్యులను గౌరవించటం వల్ల మరికొంతమంది సేవాతత్పరతతో సమాజానికి మేలు చేసేందుకు ముందుకు వస్తారన్నారు.
తాజా వార్తలు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!