యుక్రెయిన్ పై యుద్ధంతో రష్యా వొడ్కాకు కష్టాలు..
- February 28, 2022
యుక్రెయిన్ పై యుద్ధం రష్యా లిక్కర్ కొంపముంచింది. యుక్రెయిన్‌పై రష్యన్ సైన్యం దాడులు చేయడాన్ని నిరసిస్తూ.. పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి.ఈక్రమంలో రష్యాకు మరో నష్టం వచ్చి పడింది. అదేమంటే ప్రపంచ వ్యాప్తంగా మాంచి ఫేమస్ అయిన రష్యన్ వోడ్కాను కూడా ఆయా దేశాలు నిషేధించాయి.రష్యన్ వోడ్కాను ఇక అమ్మం అంటూ యూఎస్, కెనడాలు ప్రకటించాయి. స్టోర్లలోని వోడ్కా బాటిల్స్‌ను తొలగించివేస్తున్నాయి.
న్యూ హాంప్‌షైర్‌లో రష్యన్ లో తయారైన బ్రాండెడ్ స్పిరిట్‌లను ప్రభుత్వ వైన్ మరియు మద్యం అవుట్‌లెట్ల నుంచి నిషేధించారు. ఒహియోలో కూడా రష్యన్ స్టాండర్డ్ వోడ్కా కొనుగోలును ఆపాలంటూ గవర్నర్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై మాస్కో దాడిని ఖండిస్తూ కెనడియన్ మద్యం దుకాణాలు తమ షెల్ఫ్‌ల నుంచి రష్యన్ వోడ్కా మరియు ఇతర రష్యన్ తయారు చేసిన ఆల్కహాలిక్ పానీయాలను తొలగిస్తున్నాయి. మానిటోబా మరియు న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రావిన్స్‌లలోని మద్యం దుకాణాలు రష్యన్ స్పిరిట్‌లను తీసివేస్తున్నాయి.కెనడాలోని అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ అంటారియో కూడా అన్ని రష్యన్ ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని లిక్కర్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ అంటారియోని ఆదేశించింది. అంటారియోలో 679 దుకాణాల నుంచి రష్యన్ మేడ్ లిక్కర్‌ను తొలగిస్తున్నారు నిర్వాహకులు. ఇటు ప్రజలు కూడా తమ వద్ద ఉన్న రష్యన్ వోడ్కాను పారబ్రోస్తున్నారు.
ప్రపంచంలోనే ఆల్కహాల్ ఇంపోర్ట్‌లో LCBO అతి పెద్ద సంస్థ. కెనెడాలో ఉన్న ఈ సంస్థ… రష్యన్ వోడ్కాను ఇంపోర్ట్ చేసుకోమని ప్రకటించింది.దీంతో రష్యన్ లిక్కర్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతోంది.స్టాటిస్టిక్స్ కెనడా డేటా ప్రకారం,కెనడా 2021లో రష్యా నుంచి దాదాపు 30 కోట్ల విలువైన మద్యాన్ని దిగుమతి చేసుకుంది.ఇప్పుడు ఆ వ్యాపారం అంతా దెబ్బతిననుంది. కెనడియన్లు.. విస్కీ తర్వాత వోడ్కానే ఎక్కువగా తీసుకుంటారు.అందులో రష్యన్ వోడ్కానే ఎక్కువగా అమ్ముడవుతుంది.కానీ ఇప్పుడు బ్యాన్ విధించడంతో రష్యా లిక్కర్ ఇండస్ట్రీకి ఇబ్బందులు ఎదుర్కోనుంది.
రష్యన్ లిక్కర్‌ని బ్యాన్ చేయడంపై యూఎస్, కెనడా దేశస్తులు స్వాగతిస్తున్నారు.వోడ్కాను మాత్రమే కాదు..రష్యా నుంచి వచ్చే అన్ని గూడ్స్‌ను అన్ని దేశాల్లో బ్యాన్ చేయాలని..అప్పుడే రష్యా తిక్క కుదురుతుంది అంటున్నారు. దీనికి నెటిజన్ల నుంచి కూడా మంచి మద్దతు వస్తోంది.
తాజా వార్తలు
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్