`సర్కారు వారి పాట` శివరాత్రి స్పెషల్ పోస్టర్
- March 01, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ అంచనాలున్న చిత్రం `సర్కారు వారి పాట` నిర్మాణం చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ప్రధాన తారాగణం షూటింగ్లో పాల్గొంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.
మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను నేడు ఆవిష్కరించారు. సినిమాలో రౌడీ గ్యాంగ్తో మహేష్ బాబు పోరాడే సన్నివేశంలో కనిపిస్తాడు. సినిమాలో మంచి యాక్షన్ డోస్ ఉంటుందని, పోస్టర్ కూడా అదే సూచిస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సెన్సేషనల్ కంపోజర్ S S థమన్ సంగీతం అందించారు ఇప్పటికే మొదటి సింగిల్ `కళావతికి` 50 మిలియన్లకు పైగా వీక్షణలతో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రెండింగ్లో ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్గా, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్ మెంట్స్ చూసుకుంటున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12న సమ్మర్ కానుకగా రాబోతోంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు