అత్యవసర వినియోగానికై వాల్నెవా కోవిడ్ వ్యాక్సిన్‌కి అనుమతి

- March 01, 2022 , by Maagulf
అత్యవసర వినియోగానికై వాల్నెవా కోవిడ్ వ్యాక్సిన్‌కి అనుమతి

మనామా: ఫ్రాన్స్‌కి చెందిన వాల్నెవా వ్యాక్సిన్‌ వినియోగానికి బహ్రెయిన్ అనుమతులు మంజూరు చేసింది. కోవిడ్ 19 వైరస్‌పై అత్యవసర వినియోగం కింద అనుమతులు ఈ వ్యాక్సిన్‌కి మంజూరయ్యాయి. తొలి బ్యాచ్ వ్యాక్సిన్లు మార్చి నెలాఖరుకి బహ్రెయిన్ చేరుకుంటాయి. గత డిసెంబరులో ఒక మిలియన్ వ్యాక్సిన్లకు సంబంధించి అడ్వాన్స్ కొనుగోళ్ళకు ఒప్పందం కుదురింది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్. ఇన్ యాక్టివ్ వైరస్‌ ఇందులో వినియోగించబడుతుంది. ఈ తరహా వ్యాక్సిన్‌కి బహ్రెయిన్‌లో అనుమతించడం ఇదే తొలిసారి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com