ఒమన్ లో ఊబర్ టాక్సీ సర్వీసులు
- March 02, 2022
మస్కట్: యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్ – ఊబర్ ఒమన్ సుల్తానేట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ఊబర్ స్మార్ట్ టాక్సీ సర్వీసులకు లైసెన్స్ మంజూరు చేసినట్లు రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 900 నగరాల్లో ఉన్న ఊబర్ సర్వీసును ఒమన్‌లో నడిపేందుకు అనుమతిచ్చామని, దీంతో ప్రయాణికులందరికీ ఆన్-డిమాండ్ టాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈసందర్భంగా ఊబర్ స్మార్ట్ సిటీస్ CEO అహ్మద్ సలీమ్ అల్ సియాబీ మాట్లాడుతూ.. జనవరిలో మస్కట్ గవర్నరేట్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభామని, అది విజయవంతం అవ్వడంతో ఒమన్‌లోని అన్ని గవర్నరేట్లలో టాక్సీ సేవలను అందించడానికి తమకు లైసెన్స్ మంజూరు అయిందన్నారు. మహిళా డ్రైవర్ల ద్వారా మాత్రమే నిర్వహించబడే మహిళా టాక్సీ సర్వీస్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. RO10 నుండి గంటవారీ ప్యాకేజీలు ప్రారంభమవుతాయని, చెల్లింపులు నగదు, కార్డ్ లేదా యాప్‌లోని వాలెట్ ద్వారా చెల్లింపులు చేయొచ్చన్నారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్