సౌదీలో తొలిసారిగా పోర్న్ అడిక్షన్ ప్రోగ్రామ్ లాంచ్
- March 02, 2022
సౌదీ: GCC లోనే మొట్టమొదటి పోర్న్ అడిక్షన్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ను సౌదీ అరేబియా ప్రారంభించింది. 100 రోజుల్లో బాధితులకు చికిత్స అందించడం దీని లక్ష్యంగా నిర్దేశించారు. కొత్త ప్రోగ్రామ్ లో భాగంగా కౌన్సెలింగ్, టెన్ స్టెప్స్ రికవరీ సిస్టమ్ ను అమలు చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేల్ అండ్ ఫీమేల్స్ కు అందుబాటులో ఉంటుంది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఆధ్యాత్మిక చికిత్స, సురక్షితమైన సహాయక వాతావరణం ఏర్పాటుతో చికిత్స అందిస్తారు. పోర్న్ ప్రోగ్రామ్ అశ్లీలత హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది. రికవరీ ప్రక్రియలో ఇస్లామిక్ బోధనలను కూడా భాగం చేశారు. పోర్న్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా ముగించినవారికి ప్రోత్సాహకాలుగా బహుమతులను కూడా అందించనున్నారు. ప్రోగ్రాం డైరెక్టర్ సౌద్ అల్-హస్సానీ మాట్లాడుతూ.. అశ్లీలత అనేది మానవ విలువలు, మానసిక ఆరోగ్యం, ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందన్నారు. దానికి బానిసైన వారు వేధింపులు, హింస వంటి వాటికి పాల్పడే అవకాశం ఉంటుందని, ఈ సమస్యతో సామాజిక, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను దూరం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!