భారత్‌లో ఇక పెట్రోల్ రేట్ల మోతే!
- March 02, 2022
యుక్రెయిన్ దేశంపై రష్యా జరుపుతున్న యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతోంది. యుక్రెయిన్‌పై పోరులో తగ్గేదేలే అంటున్నాయి రష్యా బలగాలు. నిన్నటి నుంచి దాడుల విషయంలో గేర్ మార్చిన రష్యన్ ఆర్మీ.. ప్రధాన నగరాలపై నిరంతరంగా దాడులు చేస్తోంది. రాజధాని కీవ్ తర్వాత ఖార్కివ్ నగరంపై ఫోకస్ పెంచింది. ఈ రోజు ఖార్కివ్‌లోని మిలటరీ ఆస్పత్రి ముందు హోరాహోరిగా కాల్పులు జరిగాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇతర రంగాలపై పెను ప్రభావం చూపెడుతోంది. ఇండియన్ స్టాక్ మార్కెట్ కుదుపులకు గురవుతోంది. చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతర్జీయ మార్కెట్ లో భారీగా ధరలు పెరుగుతున్నాయి. 2022, మార్చి 02వ తేదీ బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో ఐదు డాలర్లు బ్యారెల్ ధర పెరిగింది.
న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజీ ప్రకారం 5.24 డాలర్లు బెంచ్‌మార్క్ దాటింది. యూఎల్ క్రూడ్ బ్యారెల్ ధర ప్రస్తుతం 108.60 డాలర్లకు చేరింది. యూఎల్ క్రూడ్ బ్యారెల్ ధర 5.43 డాలర్లు పెరిగింది. ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ప్రస్తుతం 110.40 డాలర్లకు చేరుకుంది. త్వరలో భారత్ లో భారీగా చమురు ధరలు పెరగనున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భారత్ లో బ్యారెల్ ధర 82-83 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఈ ధరలనే అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం బ్యారెల్ ధర 110.40 డాలర్లకు పెరగడంతో రానున్న రోజుల్లో భారీగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోలు, డీజిల్‌పై రికార్డు స్థాయిలో ధరల పెంపు ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరల కట్టడి కోసం ఇప్పటికే కీలక నిర్ణయం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తీసుకుంది.
60 మిలియన్ బ్యారెళ్ల చమురును వ్యూహాత్మక నిల్వల నుంచి విడుదల చేసేందుకు ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ’లోని 31 దేశాలు అంగీకరించాయి.అమెరికా వివిధ దేశాలతో కలిసి వ్యూహాత్మక నిల్వ కేంద్రాల నుంచి దాదాపు మూడు కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో ఈ విషయాన్ని బైడెన్ వెల్లడించారు. రష్యాపై తాము విధించిన ఆంక్షల ప్రభావం కేవలం ఆ దేశంపై మాత్రమే ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికా వ్యాపారాలు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతామన్నారు. చమురు ధరల కట్టడికి అమెరికా సహా ఇతర దేశాలు చర్యలు ప్రకటించినా.. చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం