ఒమాన్ తీరాన్ని తాకనున్న ‘అషూబా’
- June 10, 2015
అషూబా తుపాను ఒమాన్ తీరాన్ని తాకనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మిటియరాలజీ ‘హెచ్చరికలు’ జారీ చేసింది. 24 గంటల్లో ఈ తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున, తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో సౌత్ షర్కియా గవర్నరేట్ తీరానికి 650 కిలోమీటర్ల దూరంలో అషూబా తుపాను పొంచి ఉంది. తీరాన్ని తాకే సమయంలో తుపాను తీవ్రమైన గాలులతో విరుచుకుపడ్తుందనీ, భారీ వర్షాలు కురుస్తాయనీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నార్త్ షర్కియా, మస్కట్, ధక్లియా మరియు సౌత్ బటినా గవర్నరేట్స్ తుపాను ప్రభావిత ప్రాంతాలని వాతావరణ శాఖ వెల్లడిరచింది. మస్కట్ మున్సిపాలిటీ తుపాను హెచ్చరికలతో అప్రమత్తమయ్యింది. సిబ్బందిని అందుబాటులో ఉంచామనీ పౌరులకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. ఒమాన్ తీరాన్ని చేరే సమయానికి తుపాను తీవ్రత తగ్గే అవకాశం కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది గనుక, సముద్ర తీర ప్రాంతాల్లో విహారానికి వెళ్ళే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







