రమదాన్ కోసం అంతా సంసిద్ధం
- June 10, 2015
పవిత్ర రమదాన్ మాసం కోసం అన్ని ఏర్పాట్లూ శరవేగంగా జరుగుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్, ప్రజలకు రమదాన్ సందర్భంగా కూరగాయలు, పళ్ళు, చికెన్, మటన్, ఇతర ఆహార పదార్థాల్ని అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకుంటోంది. వివిధ దేశాల నుంచి గొర్రెలు, కోళ్ళను దిగుమతి చేసుకోవడం ద్వారా రమదాన్ మాసంలో ఎక్కడా ఆహార కొరత రాకుండా చూడాలని ప్రభుత్వం, వ్యాపారులను కోరింది.దీనికోసం అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.వివిధ దేశాల నుంచి వేల సంఖ్యలో గొర్రెలను దిగుమతి చేస్తున్నారు.ఇవి కాకుండా కోళ్ళనూ పెద్ద సంఖ్యలో దిగుమతి చేస్తున్నారు. వీటితోపాటు ప్రోజెన్ ఫుడ్ ఐటమ్స్‌ని కూడా అందుబాటులో ఉంచారు.బహ్రెయిన్ లైవ్ స్టాక్ కంపెనీ అంచనాల మేరకు రోజూ 4,600 గొర్రెలు వినియోగించబడ్తాయి పవిత్ర రమదాన్ మాసంలో బహ్రెయిన్ ఫ్లోర్ మిల్స్ కంపెనీ టన్నుల కొద్దీ ఆహార పదార్థాల్ని బేకరీ వినియోగం కోసం ఉత్పత్తి చేస్తోంది.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







