11న ఖతార్ లో 'తెలంగాణ అవతరణ' ఉత్సవాలు

- June 10, 2015 , by Maagulf
11న ఖతార్ లో 'తెలంగాణ అవతరణ' ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ప్రథమ అవతరణ ఉత్సవాలు ఈనెల 11న సాయంత్రం ఖతార్ రాజధాని దోహాలో నిర్వహిస్తున్నట్లు ఖతార్ తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధి శ్రీ డి.శరత్ రెడ్డి తెలిపారు. జె ఏ సి కన్వీనర్ ప్రొ. ఎం. కోదండరాం, సీనియర్ జర్నలిస్టు శ్రీ మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ఉద్యమ నాయకులు అడ్వకేట్ జె ఏ సి కన్వీనర్ శ్రీ ఎం. రాజేందర్ రెడ్డి,  వివేకానంద విద్యా సంస్థల నిర్వాహకులు శ్రీ డి. గిరివర్ధన్ రెడ్డి, శ్రీ ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి లు అథితులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఖతార్ లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసీ కుటుంబాలు, కార్మికులు, ఉద్యోగులు అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన అన్నారు. 

భారత దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతూ మాతృదేశ అభివృద్దికి పాటుపడుతున్న గల్ఫ్ వలస కార్మికులను ఆడుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవాసీ సంక్షేమ పతకాలు ప్రవేశపెట్టాలని శ్రీ శరత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆరు గల్ఫ్ దేశాలలో 10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు పనిచేస్తున్నారని, వలస కార్మికుల స్థితిగతులను తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా "ప్రవాసీ సమగ్ర సర్వే" నిర్వహించాలని ఆయన కోరారు. 

ప్రవాస భారతీయులు మాతృభూమి అభివృద్ధికి సహకరించాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోడి ఇచ్చిన పిలుపు మేరకు "ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్స్" సంస్థతో కలిసి తమ స్వగ్రామాలలో విద్యాభివృద్ధికి కృషి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ఆయన తెలిపారు.

 

--యం.భీం రెడ్డి(హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com