మార్చి 16న కువైట్‌లో సమానంగా పగలు, రాత్రి

- March 03, 2022 , by Maagulf
మార్చి 16న కువైట్‌లో సమానంగా పగలు, రాత్రి

కువైట్: మార్చి 16న( బుధవారం) నాడు కువైట్ లో పగలు, రాత్రి సమానమైన నిడివి ఉంటుంది.  పగటి సమయం 12 గంటలు, రాత్రి సైతం 12 గంటలపాటు ఉండనుంది. అల్-ఒజైరీ సైంటిఫిక్ సెంటర్‌లోని పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ ఖలీద్ అల్-జమాన్ మాట్లాడుతూ.. మార్చి 16వ తేదీ ఉదయం 5.57 గంటలకు సూర్యోదయం, సాయంత్రం 5.57 గంటలకు సూర్యాస్తమయం అవుతుందని తెలిపారు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు కొద్దగా పెరుగుతాయని ఆయన చెప్పారు. ఇలాంటి అరుదైన ఘటన సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే జరుగుతుందని, మొదటిది మార్చిలో.. రెండవది సెప్టెంబరులో జరుగుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com