షేక్ జాయెద్ ఫెస్టివల్‌లో 300 ఒంటెల మధ్య పోటీ

- March 03, 2022 , by Maagulf
షేక్ జాయెద్ ఫెస్టివల్‌లో 300 ఒంటెల మధ్య పోటీ

UAE: షేక్ జాయెద్ ఫెస్టివల్‌లో 300 ఒంటెలు పోటీ పడనున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ ఫెస్టివల్లో భాగంగా మార్చి 3-8 వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఒంటె పాలు పితికే పోటీ జరుగనుంది. ఎమిరాటీ సాంస్కృతిక, వారసత్వ కార్యకలాపాలను ప్రోత్సహించడం, సంరక్షించడం, సమాజ ప్రయోజనాల కోసం ఒంటెలు పాల ఉత్పత్తిపై అవగాహన పెంచడం ఈ ఫెస్టివ్ ఉద్దేశం. అలాగే ఒంటెలు, ఒంటె పాల ఉత్పత్తుల కోసం భారీ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఒంటె యజమానులకు అవగాహన కల్పించడం ఈ పోటీ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com