నేడు ఇ.వి.వి జయంతి

- June 10, 2015 , by Maagulf
నేడు ఇ.వి.వి జయంతి

నవ్వు నాలుగు వందల విధాలా గ్రేట్ అన్న సత్యాన్ని నమ్మి చిత్రాలను రూపొందించారు ఇ.వి.వి. సత్యనారాయణ... అందుకే ఆయన సినిమాలు ఎంతోమంది హాస్యప్రియులను మురిపించాయి, మైమరిపించాయి... కితకితలు పెట్టాయి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని నవ్వుకొనేలా చేశాయి... ఈవీవీ పండించిన నవ్వులకోసమే పలవరించే హాస్య ప్రియులు ఈ నాటికీ ఎందరో ఉన్నారు... తన గురువు జంధ్యాల బాటలోనే పయనిస్తూ ఇ.వి.వి. అనేక చిత్రాల్లో నవ్వులు పూయించారు... తన సినిమాల ద్వారా ఎందరో నటీనటులకు చిత్రసీమలో నిలదొక్కుకొనేలా చేశారు... ఇ.వి.వి. సినిమా అంటే చాలు బోలెడు మంది హాస్యనటులకు జీవనోపాధి దొరికేది... ఇ.వి.వి. సినిమాలతోనే ఎందరో జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు... తెలుగు టాప్ హీరోస్ అందరితోనూ ఇ.వి.వి. సత్యనారాయణ సినిమాలు తీసి జనానికి ఆనందం పంచారు... నవ్వుల నావలో సాగుతూనే 'ఆమె' వంటి ఆలోచింపచేసే చిత్రాన్నీ తెరకెక్కించి ఆకట్టుకున్నారు ఇ.వి.వి.... ఆయన మెగాఫోన్ పట్టుకొని నవ్వులు పూయిస్తే, తనయుడు అల్లరి నరేశ్ కెమెరాముందు నుంచుని కితకితలు పెడుతున్నాడు...ఏది ఏమైనా ఇ.వి.వి. పేరు వినగానే ఇప్పటికీ ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేస్తూంటాయి... 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com