ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం..
- March 07, 2022
కీవ్: ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నా ఉక్రెయిన్‌పై రష్యా కనికరం చూపడం లేదు. బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతూనే ఉంది. ఉక్రెయిన్‌లోని సెంట్రల్ వెస్ట్రన్ రీజియన్ రాజధాని విన్నిట్సియా విమానాశ్రయంపై రష్యా బాంబుల వర్షం కురిపించి పూర్తిగా ధ్వంసం చేసింది. రష్యా సైన్యం 8 రాకెట్లతో విమానాశ్రయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. బాంబుల మోతతో ధ్వంసమైన విమానాశ్రయం నుంచి దట్టమైన పొగలు కమ్ముకొస్తున్న వీడియో వైరల్ అయింది.
రష్యా వెనక్కి తగ్గకపోవడంతో జెలెన్స్కీ మరోమారు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. విమానాశ్రయాలను కూడా రష్యా వదలడం లేదని, ఇప్పుడు ఒడెస్సా నగరంపైనా దాడులకు సిద్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ అడుగుతూనే ఉన్నామని రష్యా నుంచి తమ దేశాన్ని రక్షించేందుకు ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఐరోపా దేశాలను అభ్యర్థించారు. ఒకవేళ అలా ప్రకటించకుంటే ఆయుధాలైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







