వాణిజ్య మోసాలపై CPA అవగాహన క్యాంపెయిన్
- March 08, 2022
మస్కట్: సుల్తానేట్‌లో వాణిజ్య మోసాలపై అవగాహన కల్పించడానికి వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) క్యాంపెయిన్ ను ప్రారంభించింది. సౌత్ షర్కియా గవర్నరేట్‌లోని వినియోగదారుల రక్షణ విభాగం మసీరాలోని ఆటో స్పేర్ పార్ట్స్ షాపులలో తనిఖీ, అవగాహన ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో ఆటో విడిభాగాల నాణ్యతను, సుల్తానేట్‌లో ఆమోదించబడిన స్పెసిఫికేషన్లు, ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. నార్త్ బటినా గవర్నరేట్‌లోని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నరేట్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సహకారంతో 'వాణిజ్య మోసం, వినియోగదారు, వ్యాపారులపై దాని ప్రభావం' అనే పేరుతో సోమవారం ఒక సింపోజియం కూడా నిర్వహించింది. క్యాంపెయిన్ లో భాగంగా నార్త్ బతినా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సోమవారం నకిలీ, అసలైన వస్తువుల మొబైల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించింది. ఫిబ్రవరి-2022లో CPA వాణిజ్య మోసానికి వ్యతిరేకంగా ‘అసలైన ఉత్పత్తులకు కట్టుబడి ఉండండి’ అనే పేరుతో ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







