నిషేధిత వస్తువుల విక్రయం.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

- March 08, 2022 , by Maagulf
నిషేధిత వస్తువుల విక్రయం.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

యూఏఈ: అబుదాబిలో నిషిద్ధ వస్తువులు విక్రయిస్తున్నందుకు, వివిధ రకాల ఆయుధాలను కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్‌లోని స్పెషల్ పెట్రోల్ డిపార్ట్ మెంట్‌కు చెందిన అల్ మిర్సాద్ విభాగానికి అనుబంధంగా ఉన్న అల్ దఫ్రాలోని అల్ మిర్సాద్ బ్రాంచ్ ఇద్దరు ఆసియన్లు, ఒక ఆఫ్రికన్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు సాగిస్తున్న బృందం గురించి పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే స్పందించి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి కత్తులు తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com